Tejas Fighter Jet Crash:దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం (IAF) అధికారికంగా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన నమార్ష్, తేజస్ ట్రయల్ ఫ్లైట్ సమయంలో జెట్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు.
ALSO READ:Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు
ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన IAF, నమార్ష్ కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి కారణాలు వెలికితీయడానికి కోర్ట్ ఆఫ్ ఇన్క్వైరీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. దేశానికి సమర్పణతో సేవలు అందించిన నమార్ష్ మరణం దేశానికి తీరని నష్టం అని అన్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
