
శివరాంలో యువతిపై కత్తి దాడి కలకలం
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం శివరాం గ్రామంలో శనివారం ఉదయం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కోండ్రు అఖిల (18) అనే యువతిని గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అఖిల ఇంటి వద్ద ఉన్న సమయంలో మంకీ క్యాప్ ధరించి వచ్చిన వ్యక్తి, ఆమెపై అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన అఖిల కేకలతో అక్కడివారు వచ్చేసరికి ఆ దుండగుడు పరారయ్యాడు….