
కాజీపేట రైల్వే స్టేషన్లో గంజాయి బ్యాగ్ గుర్తింపు
కాజీపేట రైల్వే స్టేషన్‌లో రహస్యంగా దాచిన గంజాయి బ్యాగ్‌ను పోలీస్ జాగిలం గుర్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయి తరలింపు జరుగుతుందనే సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం అక్కడ తనిఖీలు చేపట్టింది. స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఫ్లాట్‌ఫాం 1 చివర వరంగల్ వైపున ఉన్న ప్రయాణికుల బెంచ్ వద్ద రహస్యంగా దాచిన బ్యాగ్‌ను గుర్తించారు. పోలీస్ జాగిలం నిర్దేశించిన…