
గురజాలలో వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పార్టీ అని, నవరత్నాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మార్గం…