
కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్
దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడు తన జీవితాన్ని తిరిగి పొందేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం, బాధితుడు మరియు అతని భార్య షర్మిల వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసిపోయి, ఆయనకు స్వీట్స్ మరియు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. షర్మిల మాట్లాడుతూ, తన భర్త పోతున చంద్రశేఖర్ మరియు ఆమె ఇద్దరు పిల్లలతో కలసి సంతోషంగా జీవించేవారమని…