
హైదరాబాద్ నుంచి సంక్రాంతికి అత్తారింటికి వచ్చిన అల్లుడు మిస్సింగ్
హైదరాబాద్ నుండి సంక్రాంతి పండుగను తన అత్తారింటికి బొమ్మెర గ్రామంలో గడపడానికి వచ్చిన రవికుమార్ మిస్సింగ్ అయ్యాడు. అతని భార్య జయంతి, బంధువులు, స్నేహితులు 42 గంటలుగా అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుకోకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రవికుమార్ తన భార్యతో కలిసి పండుగ వేళ బొమ్మెర గ్రామంలో ఉన్న ఎల్లమ్మ గడ్డ తండాలో జరిగిన జాతరకు వెళ్ళాడు. సాయంత్రం 6:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత స్నేహితులతో మాట్లాడేందుకు బయటకు వెళ్లాడు. జయంతి…