
తిరువూరు అభివృద్ధికి 11,500 ఉద్యోగాల ప్రణాళిక – కొలికపూడి
తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు యువతకు అద్భుత శుభవార్త అందించారు. తన తొలి ప్రెస్ మీట్‌లోనే నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 11,500 ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కొలికపూడి మాట్లాడుతూ, తిరువూరును ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పారిశ్రామిక పార్క్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల నియోజకవర్గం…