Medical team examines the Narasaraopet bird flu case. Officials assure there is no need for panic.

నరసరావుపేట బర్డ్ ఫ్లూ ఘటనపై వైద్య బృందం స్పందన

నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వైద్య బృందాలు పరిశీలన చేపట్టాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ మూలాలను కనుగొనడానికి మెడికల్, హెల్త్ టీములు పని చేస్తున్నాయని తెలిపారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి వైద్య నిపుణులు కృషి చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం మంగళగిరికి చేరుకుంది. అయితే, వారు నరసరావుపేట ప్రాంతానికి వస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి…

Read More
A woman was brutally murdered in Palnadu’s Piduguralla over an alleged illicit affair and financial disputes.

పల్నాడులో దారుణం – వివాహేతర సంబంధం కారణంగా మహిళ హత్య

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని మారుతి నగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఆదిలక్ష్మి (30) అనే మహిళను హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంతో, ఆదిలక్ష్మి సహజీవనం చేస్తున్న కొండ అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేశాడని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు….

Read More
Narasaraopet Irrigation employees protest against SE, EE, alleging political pressure and harassment.

నరసరావుపేట ఇరిగేషన్ SE, EE లపై ఉద్యోగుల ఆందోళన

నరసరావుపేట ఇరిగేషన్ SE కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. SE కృష్ణ మోహన్, EE సుబ్బారావు తాము రాజకీయ వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే వత్తిడి తేవడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఇద్దరు ఉద్యోగులను SE, EE తక్షణమే మాచర్లకు బదిలీ చేయడం కలకలం రేపింది. ఈ చర్యను ఉద్యోగులు అవాంఛనీయమని, తమను భయపెట్టడానికి ఉద్దేశించిందని ఆరోపిస్తున్నారు. తాము న్యాయం…

Read More
Palnadu district schools will follow single-session timings until April 23, as per education department orders.

పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులు అమలు

పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులను అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ ప్రకటించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మాత్రం పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల…

Read More
YSRCP's 15th Formation Day celebrations were held grandly in Gurazala, Piduguralla.

గురజాలలో వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పార్టీ అని, నవరత్నాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మార్గం…

Read More
A preparatory meeting for JanaSena’s anniversary was held in Gurazala with leaders, activists, and Veera Mahilas attending in large numbers.

గురజాలలో జనసేన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు సూచన మేరకు, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. పిడుగురాళ్ల పట్టణంలోని కేఎం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నూరు మాజీ శాసనసభ్యులు, నరసరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త కిలారు రోశయ్య హాజరై, ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ, మార్చి 14న…

Read More
Cheated in online betting, a welfare assistant from Dachepalli pleads for help in a distressing selfie video, fearing for his family's survival.

ఆన్లైన్ బెట్టింగ్ మోసంతో దాచేపల్లి అసిస్టెంట్ కష్టాలు

దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ తన ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో భారీగా నష్టపోయాడు. ప్రభుత్వ స్కీం ద్వారా వచ్చిన పెన్షన్ డబ్బులు బెట్టింగ్‌కు వాడటంతో, తిరిగి చెల్లించలేని స్థితిలో చిక్కుకున్నాడు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న లక్ష్మీప్రసాద్, తన కుటుంబం రెండు రోజులుగా ఆకలితో ఉందని వీడియోలో తెలిపారు. వీడియోలో కలెక్టర్, దాచేపల్లి కమిషనర్‌ను ఉద్దేశించి క్షమాపణలు కోరారు. తల్లిదండ్రులను వేడుకొని డబ్బులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని లేకపోతే తమ కుటుంబానికి మిగిలిందేమీ లేదని ఆవేదన వ్యక్తం…

Read More