
వరంగల్ జిల్లా నర్సంపేటలో పొగమంచు దుప్పటి
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజామున పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ముఖ్యంగా దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ మండలాలలో తీవ్రంగా పొగమంచు కనిపించింది. సకాలంలో కాంతి అందక, దూరం స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు పొగమంచుతో దట్టంగా కప్పేయడంతో వాహనదారులు గతి మందగించాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగారు. వాహనాల హెడ్‌లైట్లు, హారన్‌ల సహాయంతో ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచు ప్రభావంతో పట్టణంలో…