
అంబేద్కర్ కోనసీమలో రైతుల పక్షంగా వైసీపీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ను కలసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం జరిగింది. సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు జగ్గిరెడ్డి ముందుండి చొరవ చూపగా, వాగ్వాదం నెలకొంది….