
వాణీ కపూర్ పోస్ట్ తొలగింపు, ఫవాద్ సినిమా దుమారం
బాలీవుడ్ నటి వాణీ కపూర్, పాకిస్థాన్‌కు చెందిన హీరో ఫవాద్ ఖాన్‌తో కలిసి నటించిన సినిమా ‘అబీర్ గులాల్’ ప్రస్తావనతో వివాదాల్లో చిక్కుకున్నారు. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచారంలో భాగంగా వాణీ మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. కానీ ఇదే సమయంలో పహల్‌గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి వార్తలతో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాక్ నటి/నటుడితో సినిమా చేస్తారా? ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రోత్సహిస్తారా? అంటూ పలువురు…