
షాప్ సెల్లార్‌లో బైక్ దొంగతనంపై సిబ్బంది ఆందోళన
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిగి రోడ్‌లో ఉన్న చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా సెల్లార్‌లో పార్క్ చేసిన బైకులు చోరీకి గురవుతుండటంపై వారు ఆందోళన చేపట్టారు. మాల్ యాజమాన్యానికి ఈ విషయం తెలియజేసినప్పటికీ, వారు పట్టించుకోలేదని సిబ్బంది ఆరోపించారు. ఈ రోజు ఉదయం షాపింగ్ మాల్ ఎదుట సిబ్బంది ధర్నా నిర్వహించారు. నిఘా కెమెరాలు లేకపోవడం వల్లే వరుసగా చోరీలు జరుగుతున్నాయని, యాజమాన్యం దీనిపై అసలు స్పందించలేదని…