
వేటపాలెంలో శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు ఘనంగా
బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం రామన్నపేట గ్రామంలో శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు ఘనంగా జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి తలపాగా ఊరేగింపును గ్రామ ప్రజలు, దేవాంగ సేనాధిపతులు ప్రత్యేకంగా నిర్వహించారు. మేళతాళాలతో, భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి రోజున దేవాంగపురి పంచాయితీకి చెందిన దేవాంగ కులస్తులైన శ్రీ పృథ్వి వెంకటేశ్వర్లు కుమారుడు సుబ్బారావు…