
టేకులపల్లి గ్రామంలో రైతులతో ఖమ్మం కలెక్టర్ ముచ్చట
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి, రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగు నీటి సమస్యలు, భూ సంబంధిత సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగు నీటి విడుదల షెడ్యూల్‌ను ఆయకట్టు రైతులకు ముందుగానే తెలియజేయాలని అధికారులకు సూచించారు. టెయిల్ ఎండ్ విధానాన్ని పాటిస్తూ ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు…