
శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 8మంది అరెస్టు – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్
శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని అటవీప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 పిడిలేని గొడ్డళ్లు, రవాణాకు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక ఆదేశాలతో, ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో, ఆర్‌ఐ సాయి గిరిధర్, ఆర్‌ఎస్‌ఐ వినోద్ కుమార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీమ్ శ్రీకాళహస్తి ఏర్పేడు…