ఏటి పండుగ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఏటి పండుగ ఏర్పాట్లను పెన్నా నది ఒడ్డున పరిశీలించారు. ప్రభుత్వం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కుటుంబ బంధాలను బలపరిచే పండుగగా అభివర్ణించారు. గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం కోసం భక్తులకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పార్కింగ్, శుభ్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక నిర్మాణం వంటి ఏర్పాట్లను మంత్రి ప్రశంసించారు.