
అరకు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి శ్రమించేందుకు కసిగా రంగంలోకి దిగారు. అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని పవన్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అడవి తల్లి అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మన్యం పరిరక్షణతోపాటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు. అరకు ప్రాంతం ప్రకృతితో నిండి, పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉందని పవన్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు…