
జీవో 3 పునరుద్ధరణకు గిరిజనుల పోరాటం
అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన నిరుద్యోగ యువత డీఎస్సీ నోటిఫికేషన్‌కు డిమాండ్ చేస్తూ చేపట్టిన మన్యం బంద్ రెండో రోజూ కొనసాగింది. ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేయాలని, ఏజెన్సీలో ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. బంద్‌లో భాగంగా మండల కేంద్రంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రోడ్డుపై ఆటోలు, బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజా సంఘాల నాయకులు, గిరిజన యువత పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా,…