
ఆమదాలవలసలో రాధాకృష్ణ విగ్రహ ఆవిష్కరణ
ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమదాలవలస గౌరవ శాసన సభ్యులు & పియుసి చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ హాజరయ్యారు. విద్యా రంగంలో రాధాకృష్ణ సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన బోధనలు నేటి తరం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. కూన రవి కుమార్ మాట్లాడుతూ, ఒక గొప్ప ఉపాధ్యాయుడు దేశాన్ని మార్చగల…