Accused Mahesh arrested for stabbing a youth to death in Narsipatnam’s Ayyannacolony. Old dispute during festival led to the brutal incident.

నర్సీపట్నంలో యువకుడి హత్య, నిందితుడు అరెస్టు

పండుగలో గొడవ, దుర్మార్గమైన హత్యనర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్నకాలనీలో ఈ నెల 8న తలుపులమ్మ తల్లి పండుగ సందర్భంగా స్టేజీ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో రుత్తల దుర్గాప్రసాద్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా నిందితుడు చిత్రాడ మహేష్ తో చిన్నపాటి గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో ఆ గొడవ తాత్కాలికంగా ముగిసినప్పటికీ, మహేష్ మాత్రం దురభిప్రాయంతో హత్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. చాకుతో దాడి, మృతి చెందిన దుర్గాప్రసాద్ఘటన జరిగిన రాత్రి ఒంటి గంట సమయంలో…

Read More
Ex-MLA Petla Umashankar Ganesh criticizes Speaker’s remarks on Nookambika Temple tenders.

స్పీకర్ వ్యాఖ్యలు విడ్డూరం – పెట్ల ఉమాశంకర్ గణేష్

స్పీకర్ పదవి ఎవరికి గొప్పని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూకాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని తెలిపారు. ఆలయం నిర్మాణం గురించి తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతాయుతమైన పదవికి తగదని అన్నారు. గత మంగళవారం ఆలయం గురించి మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు గౌరవ స్పీకర్ అయ్యన్న అని సంబోధించడంతో, ఒక టిడిపి కౌన్సిలర్ చేత తనపై విమర్శలు చేయించడం సరికాదని పెట్ల…

Read More
YSRCP Formation Day celebrations were held grandly in Narsipatnam under the leadership of former MLA Petla Umashankar Ganesh.

నర్సీపట్నంలో వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పెద్ద బొడ్డేపల్లి వైయస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ వైయస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను నవరత్నాల పథకాల ద్వారా తగ్గించారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో కీలక మార్పులు తీసుకువచ్చాయని, నవరత్నాల…

Read More
Women’s Day was celebrated grandly at Narsipatnam Govt. Degree College with competitions for students and prize distribution.

నర్సీపట్నంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. విద్యార్థినులు తమ భవిష్యత్తు కోసం…

Read More
Narsipatnam in-charge Rajana Veerasurya Chandra urged everyone to make the Jana Sena Formation Day a success. Grand preparations underway.

జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని పిలుపు

ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర, జనసైనికులు, అభిమానులకు సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నర్సీపట్నంలోని కృష్ణాపేలస్‌లో సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేన 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నిబద్ధతతో ముందుకు సాగిందన్నారు….

Read More
A man was found hanging from a tree in Narsipatnam NTR Stadium. A bag, knife, and broken glasses were recovered from the scene.

నర్సీపట్నం స్టేడియంలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన ప్రజలు మృతదేహాన్ని వేలాడుతూ చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనతో స్టేడియం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఓ బ్యాగు, చిన్న కత్తి, విరిగిన కళ్లద్దాలు లభ్యమయ్యాయి. మృతుడు ఎవరు? ఈ ఘటన ఆత్మహత్యా లేదా హత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు మృతదేహాన్ని…

Read More
Authorities demolished illegal constructions by a YSRCP leader in Narsipatnam. Former MLA Ganesh made strong remarks.

నర్సీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, ఉద్రిక్తత

నర్సీపట్నం మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాల తొలగింపును చేపట్టారు. శారద నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన వైసీపీ నేత కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఉదయం 6 గంటలకే మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు. ఈ చర్యల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం…

Read More