
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం – మరో రెండు మృతదేహాలు గుర్తింపు
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు మూడు మృతదేహాలను గుర్తించారు. నిన్న తొలిమృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ బృందం, నేడు మరో రెండు మృతదేహాలను గుర్తించింది. బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మొదట గుర్తించగా, అదే ప్రదేశంలో మరో ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు కనిపించాయి….