
జగ్గయ్యపేటలో భారీగా గంజాయి పట్టివేత
NTR జిల్లా జగ్గయ్యపేట వద్ద భారీ గంజాయి పట్టుకున్నారు. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద నిఘా నిర్వహించిన పోలీసులు ఈ ఘనత సాధించారు. రహస్య సమాచారం ఆధారంగా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, పోలీసుల నిఘాను గుర్తించి, తిరిగి విజయవాడ వైపు వెళ్లడం గమనించారు. కారు వేగంగా దూసుకెళ్లడం చూసి అనుమానించిన పోలీసులు కారును చేజ్…