
పట్టభద్రుల హక్కుల కోసం పిడిఎఫ్ కు మద్దతు అవసరం
రేపల్లె పట్టణంలో ప్రజాసంఘాలు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించాలని ప్రచారం నిర్వహించాయి. ఇందులో భాగంగా కోర్టు వద్ద న్యాయవాదులు, వివిధ సంస్థల్లో పనిచేసే పట్టభద్రులను కలిసి మద్దతు కోరారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ శాసనమండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం ఉండటం ద్వారా హక్కులు కాపాడబడతాయని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాలపై చట్టసభల్లో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని రమాదేవి అన్నారు. ప్రజల వాణిని వినిపించేందుకు శాసనమండలిలో పిడిఎఫ్ అభ్యర్థులు గెలవాలని…