
నారాయణపేటలో అక్రమ నల్ల బెల్లం రవాణా పట్టివేత
నారాయణపేట పట్టణంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమంగా రవాణా చేస్తున్న నల్ల బెల్లాన్ని పట్టుకున్నారు. కర్ణాటకలోని గుర్మిట్కల్ పట్టణం నుండి మహబూబ్‌నగర్‌కు తరలిస్తున్న 1,140 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుబడిందని సీఐ శివశంకర్ తెలిపారు. దీని విలువ సుమారు రూ. 1,14,000 ఉంటుందని ఆయన వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లాన్ని గుర్తించిన పోలీసులు, సంబంధిత వాహనాన్ని సీజ్ చేశారు. విచారణలో, హనుమాన్ నాయక్ అనే వ్యక్తి నల్ల బెల్లాన్ని విక్రయించగా, రాజు, కిరణ్…