
అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన మంత్రి ఆనం
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో మంత్రిని ఆలయ రీతిపద్ధతిన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితుల ద్వారా వేదాశీర్వాదం అందించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్…