
పదవీ విరమణ అనంతరం గ్రామ ప్రజల సన్మానంతో అప్పలస్వామి గౌరవింత
మెలియాపుట్టి మండలం చోంపపురం గ్రామానికి చెందిన మణిగాం ఎం. అప్పలస్వామి మూడు దశాబ్దాల పాటు దేశ సరిహద్దుల్లో అంకితభావంతో సేవలందించారు. నేషనల్, ఇంటర్నేషనల్ కామాండోగా తన సేవలను ప్రపంచ స్థాయిలో చాటుకున్నారు. 2024 డిసెంబర్ 31న పదవీ విరమణ పొందినప్పటికీ, దేశం కోసం ఎప్పుడు కావాలన్నా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామానికి తిరిగివచ్చిన అప్పలస్వామిని గ్రామ ప్రజలు అత్యంత ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆయనకు స్వాగతం…