Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaSangareddyపరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి:MLA Chinta Prabhakar

పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి:MLA Chinta Prabhakar

-

Chat on WhatsApp

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 92లో TGIIC ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు.

పరిశ్రమల లో కోల్పోతున్న భూముల మీదనే తమ కుటుంబాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయని, భూములు తీసుకుంటే అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు స్వాధీనం చేసుకునే ముందు భూ బాధితులకు తగిన పరిహారం ఎంత ఇవ్వబోతున్నారో స్పష్టత ఇవ్వాలని వారు కోరారు.

ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, అదేవిధంగా ఒక ప్లాట్ కేటాయించాలని, సాగులో ఉన్న భూములకు సరైన మరియు న్యాయమైన పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ALSO READ:Tejas fighter jet crashes | దుబాయ్‌లో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp