
రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ధర్నా
రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వంద పడకల ఆసుపత్రికి అనుగుణంగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు ఆసుపత్రిలో అవినీతిని అరికట్టాలని, వైద్య సేవలు మెరుగుపరిచే అంశాలను పైకి తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామాలయం నుండి ప్రదర్శనగా ఆసుపత్రికి చేరుకున్న కార్మికులు, తమ ఆందోళనను విజ్ఞప్తి రూపంలో తెలియజేశారు. ఏఐటీయూసీ…