
జైతవరం గ్రామంలో బాలల కమిటీ సమావేశం
అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలం, జైతవరం గ్రామ సచివాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ఒక ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కమిటీల ప్రధాన ఉద్దేశ్యం బాల్య వివాహాలను నివారించడమే కాక, మహిళలపై జరిగే దాడులను, వేధింపులను అరికట్టడంలో కీలక పాత్ర పోషించడమేనని ఆమె…