Somireddy advises farmers to sell paddy at MSP, warns against middlemen. Govt assures payment within 24 hours.

ధాన్యం తక్కువ ధరకు అమ్మొద్దని రైతులకు సోమిరెడ్డి పిలుపు

వెంకటాచలం మండలం గొలగమూడి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువకు ధాన్యం అమ్మొద్దని, దళారుల మాయలో పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపునిచ్చారు. పుట్టికి ₹19,720 చెల్లిస్తున్న ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యం అమ్మాలన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని, రైతులకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ట్యాగ్ చేసిన రైస్…

Read More
Nellore Commissioner Surya Teja orders fines for waste dumping in open spaces, with strict monitoring through CCTV.

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసిన వారిపై కఠిన చర్యలు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్త ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు కమిషనర్ సోమవారం 20వ డివిజన్ పరిధిలోని హనుమాన్ జంక్షన్, స్నేహ నగర్, అక్షయ గార్డెన్, వనంతోపు ప్రాంతాల్లో పర్యటించారు. అపార్ట్మెంట్ల నుంచి ఖాళీ స్థలాల్లో…

Read More
Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy inspected the construction of a 50-bed Critical Care Unit.

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ పరిశీలన

నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని, అత్యాధునిక వైద్య సదుపాయాలతో దీన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ యూనిట్…

Read More
Illegal soil transport continues in Mudivarthi village with 20 tractors. Despite police action, political pressure is enabling the mafia’s operations.

విడవలూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది

విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 20 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఘటన గ్రామస్తుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ మాఫియా నిరభ్యంతరంగా దందా సాగిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నంబర్ ప్లేట్లు లేకుండా, లైసెన్స్ లేని డ్రైవర్లతో మట్టిని అధిక వేగంతో తరలిస్తున్న మాఫియా పోలీసులను సైతం లెక్కచేయడం…

Read More
Minister Nadendla Manohar was warmly welcomed by Minister Anam Ramanarayana Reddy in Nellore. Leaders met to discuss various district matters.

నెల్లూరులో నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి విచ్చేసి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు మంత్రులు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, ప్రస్తుత సమస్యలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మంత్రి నివాసానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు, జిల్లా…

Read More
A college bus overturned near Minagallu, but no students were on board, preventing a major accident.

మినగల్లు వద్ద విద్యాసంస్థ బస్సు బోల్తా – అంతా సురక్షితం

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మినగల్లు గ్రామ సమీపంలో గుత్తికొండ శ్రీరాములు విద్యాసంస్థల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు పెనుబల్లి నుండి మినగల్లు వెళ్లే రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన బస్సు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బస్సును పరిశీలించారు. అదృష్టవశాత్తూ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ మార్గంలో తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని…

Read More
As part of the road safety month, Sangam CI and SI conducted an awareness camp for tractor drivers.

సంగంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు – అవగాహన క్యాంపు

సంగం మండలంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని సీఐ వేమా రెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొండ కూడలి వద్ద ప్రత్యేకంగా ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు రహదారి ప్రమాదాల నియంత్రణపై సూచనలు చేశారు. రహదారి భద్రతకు సంబంధించిన పలు సూచనలను అధికారుల సమక్షంలో వివరించారు. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించారు. రహదారిపై ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో నడిపే ప్రమాదాలను అధికారులు వివరించారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు…

Read More