
100% హాజరుతో ఆదర్శంగా నిలిచిన అక్కాచెల్లెళ్లు
విద్యార్థులలో హాజరు శాతం తక్కువగా ఉండే పరిస్థితుల్లో జనగామ జిల్లా మాన్‌సింగ్ తండా గ్రామానికి చెందిన రితిక, పార్వతిలు అన్ని రోజులు బడికి హాజరై అందరికీ ఆదర్శంగా నిలిచారు. రితిక 3వ తరగతి, పార్వతి 4వ తరగతిలో చదువుతున్నారు. వీరిద్దరూ విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ 12వ తేదీ నుండి ముగిసే వరకూ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు హాజరయ్యారు. వారిద్దరూ కేవలం హాజరులోనే కాకుండా చదువులో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. పరీక్షల్లో మెరుగైన…