అన్నారం షరీఫ్ లో మూడు రోజులపాటు ఉర్సు ఉత్సవాలు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు హజ్రత్ యాకూబ్ షావలి ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లిస్తారు. వక్స్ బోర్డు అధికారులు భక్తుల సౌకర్యాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.