
చౌటుప్పల్ వద్ద మూడు కార్లు ఢీ
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్థంభించింది. ప్రమాదానికి కారణం ముందుగా వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడం వలన ప్రమాదం జరిగింది అని పోలీసులు తెలిపారు. వెనుక వస్తున్న కార్లు వేగంగా రావడం తో ఒకదానికొకటి ఢీకొన్నాయి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు….