
ప్రత్తిపాడులో సిపిఎం ఆందోళన – ప్రభుత్వాన్ని నిలదీసిన నేతలు
ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ కరిముల్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రజా చైతన్య యాత్రలలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ, స్మశాన వాటికలు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, మురుగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గారపాడు…