
వింజమూరులో కొత్త డయాలసిస్ సెంటర్ ప్రారంభం
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు. రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఐదు పడకలతో ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాలను కేంద్రం కేటాయించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 18 డయాలసిస్ కేంద్రాలను 10 నెలల వ్యవధిలో…