
ఈదురు గాలులకు మామిడితోటలు తునాతునక!
నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో గల పలు గ్రామాల్లో ఈదురు గాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంటపై ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్న రైతులకు తీరని దెబ్బ తగిలింది. ముసునూరు మండలం కేతరాజుపల్లి, చాట్రాయి మండలంలోని పలు తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో పంట దిగుబడి తక్కువగా రావడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆ పరిస్థితుల్లో ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపించింది. తుపాన్లు లేకుండానే వచ్చిన ఈదురు గాలులు మామిడికాయలను తోటల…