
గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డి అరెస్టు
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి గోశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కలకలం రేపింది. తిరుపతిలో గల గోశాలలోకి ప్రవేశించేందుకు ఆయన యత్నించగా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అభినయ్ రెడ్డి మాట్లాడుతూ… గోశాలకు రావాలంటూ టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను తాము స్వీకరించామని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ తమను అడ్డుకుందని తీవ్రంగా విమర్శించారు. “సవాళ్లు చేస్తారు, స్వీకరించి వస్తే అడ్డుకుంటారు……