Vemulapalli sees uproar over alleged peacock meat sale. Officials investigate whether it’s really a peacock or a water hen.

వేములపల్లిలో నెమలి మాంసం కలకలం!

వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని ఎరుకలవాడలో నెమలి మాంసం విక్రయిస్తోన్నారంటూ తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఓ వ్యక్తి నెమలి మాంసాన్ని విక్రయిస్తున్నాడన్న సమాచారం ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు అందించాడు. ఆ వెంటనే వేములపల్లి పోలీసులు, ఆటవిశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పదంగా ఉన్న మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మాంసం విక్రయించిన వ్యక్తి అది నెమలి కాదు, నీటి కోడి అని చెప్పడంతో ఇది నిజంగా జాతీయ పక్షి…

Read More
MLA Bathula Lakshmareddy celebrated Holi grandly at Miryalaguda camp office and extended wishes to the people.

మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హోలీ సంబరాలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ క్యాంప్ కార్యాలయంలో హోలీ పండుగను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గిరిజన సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. హోలీ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గిరిజన సంఘం నాయకులతో కలిసి రంగులు చల్లుకున్నారు. సామరస్యంగా జరిపిన ఈ వేడుకలు ప్రాంతంలోని ప్రజలలో ఆనందాన్ని పెంచాయి. రంగుల వెదజల్లుతో హోలీ ఉత్సాహంగా సాగగా, ప్రజలు ఎమ్మెల్యేతో కలిసి…

Read More
Ranganath’s key revelations in the Miryalaguda Amrutha-Pranay honor killing case, his approach to investigation and actions taken against the accused."

మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో, అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ అనేక కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు. ఈ కేసు ఒక పరువు హత్య అని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తులు చాలా తెలివిగా వ్యవహరించారని రంగనాథ్ పేర్కొన్నారు. ముందుగా ఈ కేసు గందరగోళంగా ఉండడంతో…

Read More
Inter first-year exams start in Miryalaguda under strict security, with 144 Section in place at exam centers.

మిర్యాలగూడలో కట్టుదిట్టమైన బందోబస్తులో ఇంటర్ పరీక్షలు

మిర్యాలగూడలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారులు పరీక్షల ఏర్పాట్లను పూర్తి చేసి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసే విధంగా నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచుతూ 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండేందుకు ఫ్లయింగ్…

Read More
Teacher MLC elections polling began in five centers of Miryalaguda constituency with strict security arrangements in place.

మిర్యాలగూడలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. మిర్యాలగూడలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో 811 మంది, దామరచర్లలో 56 మంది, అడవి దేవులపల్లిలో 8 మంది, వేములపల్లిలో 45 మంది, మాడుగులపల్లిలో 32 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అధికారులు…

Read More
On Maha Shivaratri, devotees thronged Miryalaguda temples, performing special rituals and chanting Shiva’s name with devotion.

మిర్యాలగూడ శివాలయాల్లో మహాశివరాత్రి భక్తి సందడి

మహాశివరాత్రి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని శివాలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంది. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివ నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకుంటూ స్వామివారికి కృపను అభ్యర్థిస్తున్నారు. కొందరు ఉపవాస దీక్షలు చేపట్టి, జాగరణ చేసేందుకు ఆలయాల వద్ద ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రసిద్ధ శివక్షేత్రాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. స్వామి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ కమిటీలు భక్తులకు తగిన…

Read More
District Collector Ila Tripathi inspected schools and hospitals in Miryalaguda, emphasizing improved education and healthcare services.

మిర్యాలగూడలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి చర్చించి, వారి విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అవసరాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని లేబర్ రూమ్, జనరల్ వార్డులను పరిశీలించి, ప్రస్తుతంగా జరుగుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమ్మర్ద్‌తో…

Read More