
సాలూరులో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సాలూరు శివాజీ బొమ్మ జంక్షన్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, మహానాయకుడిని స్మరించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ చత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గొప్ప యోధుడు అని అన్నారు. ఆయన ధైర్యం, నాయకత్వం, త్యాగం అనుకరణీయమని, ముఖ్యంగా యువత శివాజీ బాటలో…