
భారతి సిమెంట్ మైనింగ్ పేలుళ్లపై గ్రామస్తుల ఫిర్యాదు
వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలో మైనింగ్ పేలుళ్లతో ఇళ్లకు గండిపడుతోందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్ కంపెనీ నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు చీలిపోతున్నాయని, భద్రత లేకుండా జీవించాల్సి వస్తోందని వారు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలోనూ అధికారులు తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో మళ్లీ ఫిర్యాదుకు వచ్చామని పేర్కొన్నారు….