
కుతుకులూరులో కూటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఘనంగా
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత కూటేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శివాలయ పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. గ్రామ ప్రజల సహకారంతో మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ యలమంచిలి కృష్ణమూర్తి శివాచార్య ఆధ్వర్యంలో, వేద పండితుల నడిపాణిలో ఐదవ రోజు పూజలు కన్నుల పండుగగా జరిగాయి. గవ్యాంతపూజ, యంత్ర మంత్ర జపాలు, గోపూజ, ధాన్యాదివాస బింబ ఉద్వాసన, ఉదకశాంతి,…