
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన – ప్రాథమిక నివేదిక
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వెలుగులోకి వచ్చింది. విమానం ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్‌లు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో ఇంధన సరఫరా నిలిచిపోయింది. పైలట్‌లు ఏం జరగుతోందో గ్రహించేవరకు దాదాపు 10 సెకన్ల వ్యవధిలో ఇంజిన్లు రెండు ఆగిపోయాయి. దీంతో విమానం వాయు గమనం కోల్పోయి కుప్పకూలింది.
ఉదయం 11:17
→ ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ (VT-ANB) అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
మధ్యాహ్నం 1:10:38
→ బే 34 నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది.
1:25:15
→ ట్యాక్సీ క్లియరెన్స్ కోసం అనుమతి కోరగా, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ ఆమోదించింది.
1:32:03
→ గ్రౌండ్ కంట్రోల్ నుంచి టవర్ కంట్రోల్‌కు మారింది.
1:37:33
→ టేకాఫ్ క్లియరెన్స్ లభించింది.
1:37:37
→ విమానం టేకాఫ్ ప్రారంభించింది.
1:38:39
→ విమానం గాల్లోకి లేచింది; సెన్సార్లు ఎయిర్ మోడ్‌లోకి మారాయి.
1:38:42
→ గరిష్ఠ వేగం (180 నాట్స్) చేరిన వెంటనే ఇంజిన్ 1, 2 యొక్క ఇంధన స్విచ్‌లు అకస్మాత్తుగా ‘కటాఫ్’ స్థితికి మారాయి.
1:38:47 & 1:38:56
→ ఇంజిన్ స్విచ్‌లు తిరిగి ‘రన్’ స్థితికి మారినప్పటికీ, రెండో ఇంజిన్ పూర్తిగా పునరుద్ధరించలేకపోయింది.
1:39:05
→ పైలట్ “Mayday Mayday Mayday” అని అత్యవసర సందేశం పంపించారు.
1:39:11
→ డేటా రికార్డింగ్ ఆగిపోయింది.
1:44:44
→ సహాయక చర్యల కోసం ఫైర్ టెండర్లు బయలుదేరాయి.