
కరీంనగర్‌లో అరుదైన నారాయణ పక్షి దర్శనం
కరీంనగర్ జిల్లాలో సోమవారం అరుదైన జాతికి చెందిన నారాయణ పక్షి కనువిందు చేసింది. నలుపు, బూడిద రంగు రెక్కలు, పొడవాటి కాళ్లు, ముక్కుతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ఈ పక్షి స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించింది. అసాధారణంగా ఈ పక్షి అక్కడ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ పక్షిని సాధారణంగా నారాయణ పక్షిగా పిలుస్తారు. దీనికి శాస్త్రీయ నామం ఆర్డియా సినిరియా అని ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిర్మణయి తెలిపారు. ఈ జాతి…