
నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మైదానం శుభ్రీకరణ
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ, అరవపల్లి క్రీడా మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుభ్రీకరణ కార్యక్రమం నిర్వహించారు. మైదానంలో ఉన్నటువంటి పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు తొలగించి, క్రీడాకారులకు మరియు పాదచారులకు సౌకర్యంగా మార్చే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడపోతుల రాము సహకారం అందించారు. ఉపాధి హామీ కార్మికుల సహాయంతో మైదానాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్లు మన్నెం రామమోహన్, కుర్రా మణి యాదవ్, క్లబ్ సెక్రటరీ…