
విజయవాడ ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదం – జనసేన నేతల సహాయ చర్యలు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ పరిధిలోని కాశ్మీర్ జలకన్య ఆవరణలో ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుండగా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరుకునేలోపు, జనసేన నాయకుడు తిరుపతి సురేష్ తన సహచరులతో సహాయ చర్యల్లో పాల్గొన్నారు. స్థానిక జనసేన నాయకులు తిరుపతి సురేష్, అతని మిత్రబృందం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. గంటసేపు తీవ్రంగా కృషి…