
నల్లగొండలో కిడ్నాప్ కలకలం.. బాలుడు సురక్షితం!
నల్లగొండ జిల్లాలో మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కావడం స్థానికంగా కలకలం రేపింది. బాలుడు అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. దీంతో బాలుడు నకిరేకల్‌లో గుర్తింపు పొందాడు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిగా సీతారాములు అనే నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి…