
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించిన స్విమ్స్
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో డక్కిలి మండలంలోని శ్రీపురం, లింగసముద్రం గ్రామాల్లో గురువారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ డి.బిందు ప్రియాంక గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారికి నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సులు మొబైల్ క్యాన్సర్…