
విజ్ఞాన్ కళాశాలలో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహణ
విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు సూచించారు. రాయవరం మండల కేంద్రంలోని విజ్ఞాన్, వీఎస్ఆర్ రూరల్ కళాశాలల ప్రాంగణంలో ఫేర్వెల్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమ్మి రెడ్డి విద్యాసంస్థల అధినేతలు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి, శేషవేణి, రాయవరం సాయి తేజ విద్యానికేతన్ చైర్మన్ కర్రి సందీప్ రెడ్డి, భాను రేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….