Dalit unions protested demanding SI Boddu Devi's suspension and fair investigation over a clash during a temple event in Vallampudi.

వళ్ళంపూడి ఎస్ఐ దేవి సస్పెన్షన్ డిమాండ్ చేసిన దళిత సంఘాలు

వేపాడ మండలంలోని వళ్ళంపూడి పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎస్‌ఐ బొడ్డు దేవిని తక్షణమే సస్పెండ్ చేయాలని, ఆమెపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత నెల 11న గుడివాడ గ్రామంలో జరిగిన వేణుగోపాలస్వామి జాతరలో చోటుచేసుకున్న ఘటనపై స్పందిస్తూ ఈ నిరసన నిర్వహించారు. జాతర సందర్భంగా “డాన్స్ బేబీ డాన్స్” కార్యక్రమంలో గుడివాడ గ్రామానికి చెందిన మోహన్‌కి మరియు ఎస్‌ఐ దేవికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ…

Read More
CPI demands 2 cents in urban areas, 3 cents in rural areas for housing. Protest held at Vizianagaram Tahsildar office.

పేదలకు ఇళ్ల స్థలాల కోసం సీపీఐ నిరసన

కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా పేదలకు ఇళ్ల స్థలాల మంజూరులో ఎలాంటి పురోగతి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య విమర్శించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్‌తో విజయనగరం తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నేతలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్స్ నగర్ నుంచి పట్టణ వీధుల్లో సీపీఐ ఆధ్వర్యంలో…

Read More
Students rallied and submitted a petition to RTC DM, demanding an increase in school buses and timely availability.

బడి బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థుల డిమాండ్

పట్టణంలో బడి బస్సుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు తగినంత బస్సులు లభించకపోవడం వల్ల, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు జి. సూరిబాబు, కార్యదర్శి కె. రాజు మాట్లాడుతూ, జిల్లాలో విద్యార్థులు తరచుగా బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, అందుకే బడి బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్…

Read More
People submitted grievances to TDP leader Kimidi Nagarjuna, who urged the collector for resolutions.

సమస్యల పరిష్కారానికి కిమిడి నాగార్జునకు వినతిపత్రం

విజయనగరం జిల్లా వివిధ మండలాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను కలిశారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. అనంతరం ఈ సమస్యలపై కిమిడి నాగార్జున స్పందించి, పరిష్కారం కోసం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండలంలో ముస్లిం వర్గానికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు, చౌడువాడ పంచాయితీలో 3 ఫేస్ విద్యుత్ అందుబాటులోకి తేవడం,…

Read More
DYFI protests, urging the government to resolve the court case and conduct the constable main exam soon.

కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డివైఎఫ్ఐ డిమాండ్

కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో విజయనగరంలో నిరసన చేపట్టారు. కోటజంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ చి. హరీష్ మాట్లాడుతూ, 2022 నవంబర్ 28న 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలై, 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. 95,208 మంది అర్హత…

Read More
YSRCP Formation Day was celebrated in Vizianagaram, where students and unemployed youth held a rally and submitted a petition to the Collector.

వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం – నిరుద్యోగుల నడక ర్యాలీ

వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపుమేరకు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పార్టీలోని ప్రముఖులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నేతలు ప్రసంగించారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసనగా నడక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలోని నెహ్రూ యువ కేంద్రం నుంచి ప్రారంభమై…

Read More
On Mahashivratri, ministers Kondapalli Srinivas Rao and Gummadi Sandhya Rani visited the Jayithi Sri Mallikarjuna Swamy Temple in Mentada Mandal.

జయితి మల్లికార్జున స్వామిని దర్శించిన మంత్రులు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలోని శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. 11వ శతాబ్దంలో స్వయంభుగా వెలసిన ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో పుణ్యఫలదాయకమని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్వయంభుగా వెలసిన శివాలయాన్ని దర్శించడం వల్ల ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు…

Read More