నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే ప్రారంభం : కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికకు సర్వే ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం మండలంలో కుందూరుపల్లిలో రైతు భరోసా విచారణను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే, 21-24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. గణపురం మండలంలో 691 మంది రేషన్ కార్డుల కోసం నమోదు అయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఓ…